తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వివో తప్పుకోవడం పెద్ద సమస్య కాదు' - వివో గురించి గంగూలీ

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్​షిప్ నుంచి వివో తప్పుకున్నంత మాత్రాన బోర్డుకు ఆర్థినంగా నష్టాలు వచ్చే అవకాశం లేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. అన్ని సమస్యలను బోర్డు హ్యాండిల్ చేయగలదని స్పష్టం చేశాడు,

వివో తప్పుకోవడం పెద్ద సమస్య కాదు
వివో తప్పుకోవడం పెద్ద సమస్య కాదు

By

Published : Aug 9, 2020, 3:26 PM IST

భారత్‌-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ ఏడాది ఐపీఎల్‌పై ప్రభావం చూపాయి. చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమ నేపథ్యంలో టైటిల్‌ స్పాన్సర్‌ అయిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వివో’ ఈ ఏడాదికి తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త స్పాన్సర్‌ను వెతికే పనిలో నిమగ్నమైంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. వివో తప్పుకున్నంత మాత్రాన తమ బోర్డుకు ఆర్థికంగా నష్టాల్లోకి జారుకోలేదని, అది తాత్కాలిక సమస్యేనని పేర్కొన్నాడు.

"దీన్ని నేను ఆర్థిక నష్టంగా భావించట్లేదు. అదొక తాత్కాలిక సమస్య అంతే. ఇప్పుడు చేయాల్సిందల్లా కొద్ది కాలం ధైర్యంగా ముందుకు సాగడమే. గొప్ప విశేషాలు, కార్యక్రమాలు ఒక్కరాత్రిలోనే జరిగిపోవు. అలాగే అవన్నీ ఒక్కరోజే వెళ్లిపోవు. కొన్ని నిర్ణయాలు నష్టాలను తీసుకొస్తే మరికొన్ని లాభాలను తెచ్చిపెడతాయి. అన్నింటికి సిద్ధంగా ఉండాలి. బీసీసీఐ బలమైన బోర్డు. దానికి గట్టి పునాదులు ఉన్నాయి. గత పాలకులు, టీమ్‌ఇండియా ఆటగాళ్లు బోర్డును ఎంతో బలంగా నిర్మించారు. ఇలాంటి తాత్కాలిక సమస్యలను హ్యాండిల్‌ చేయగలదు."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

2017 నుంచి 2022 వరకు వివో ఐదేళ్ల పాటు ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న చేసుకుంది. ఈ ఒప్పదంతో ఏడాదికి భారత బోర్డుకు సుమారు 440 కోట్లు ఆర్థిక మొత్తం లభించేది. ఇప్పుడు అంత మొత్తంలో చెల్లించే మరో సంస్థ దొరకడం కష్టమని మార్కెటింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details