ప్రపంచకప్ ఓటమి తర్వాత టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 3న ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై కొందరు మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ సారథి గంగూలీ స్పందిస్తూ రహానే, శుభమన్ గిల్‌లకు వన్డే జట్టులో చోటు కల్పించపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశాడు.
"జట్టులో మూడు ఫార్మాట్లలోనూ సత్తాచాటగల ఆటగాళ్లు ఉన్నారు. అలాగే రహానే, శుభమన్‌గిల్ వన్డే జట్టులో లేకపోవడం ఆశ్చర్యకరం" అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు.
ముూడు ఫార్మాట్లలోనూ ఒకే ఆటగాళ్లను తీసుకుంటే వారి ఆటలో స్థిరత్వం పెంపొంది ఆత్మ స్థైర్యం పెరుగుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అందరనీ సంతృప్తిపరచడం కంటే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకోవడం ముఖ్యమని తెలిపాడు.