తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో సురేష్ రైనా మరో రికార్డు - chennai super kings

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్​లో ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.

రైనా

By

Published : Apr 15, 2019, 9:11 AM IST

కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​లో 58 పరుగులు చేసిన సురేష్ రైనా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

కోల్​కతా నైట్ రైడర్స్​పై 58 పరుగులతో ఆకట్టుకున్న రైనా ఓ జట్టుపై ఐపీఎల్​లో అత్యధిక పరుగులు (807) చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ముంబయిపై 803 పరుగులు చేసి రెండో స్థానంలోనూ రైనానే ఉండటం విశేషం. కోహ్లీ దిల్లీ జట్టుపై 802 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవీ చూడండి .. రో'హిట్టింగా'... విరాట్​ సేన విజయమా!

ABOUT THE AUTHOR

...view details