టీమ్ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాక తొలిసారి నోరు విప్పాడు. పంజాబ్‌లో తమ కుటుంబంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై స్పందించాడు. అక్కడ జరిగింది దారుణం కంటే ఘోరమని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
"పంజాబ్‌లో మా కుటుంబానికి జరిగింది దారుణం కన్నా ఘోరం. మా మామయ్య హత్యకు గురయ్యారు. మా మేనత్త, వాళ్ల ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి మరొకరు కన్నుమూశారు. ఇప్పటికీ మా అత్తయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు"
-- సురేశ్ రైనా, భారత మాజీ క్రికెటర్