తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ, జై షా పిటిషన్​పై 23న విచారణ​ - jai sha

బీసీసీఐలో తమ పదవీ కాలాలు పెంచాలని గంగూలీ, జై షాలు వేసిన పిటిషన్​పై విచారణ తేదీని సుప్రీం ఖరారు చేసింది. మార్చి 23న ద్విసభ్య ధర్మాసనం ముందుకు సదరు పిటిషన్​ వస్తుందని స్పష్టం చేసింది.

Supreme Court to hear on March 23 the petition filed by Board of Control for Cricket
మార్చి 23న సుప్రీం ముందుకు బీసీసీఐ పిటిషన్​

By

Published : Feb 16, 2021, 9:03 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శులుగా తమ పదవీ కాలాలు పెంచాలని సౌరభ్​ గంగూలీ, జై షాలు వేసిన పిటిషన్​ను.. విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 23న.. జస్టిస్​ ఎల్​ నాగేశ్వర్​ రావు, జస్టిస్​ ఎల్​ రవీంద్ర భట్​లతో కూడిన ధర్మాసనం పిటిషన్​ను పరిశీలించనుంది.

ముగిసిన పదవీకాలం..

గతేడాది అక్టోబరు 23న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఆ పదవిలో 278 రోజులు మాత్రమే కొనసాగాల్సి ఉంది. ఎందుకంటే క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్​ (సీఏబీ)లో 2014లో కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ పదవీకాలాన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి చేర్చగా.. గతేడాడి జులై 26తో అతని పదవీకాలం పూర్తయ్యింది.

కొన్ని వార్తాపత్రికల నివేదికల ద్వారా బీసీసీఐ కార్యదర్శి జై షా.. 2013 సెప్టెంబరు 8న గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​ (జీసీఏ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీంతో పాటు బీసీసీఐ పదవీకాలంతో సంబంధం ఉన్న కారణంగా.. జై షా పదవీకాలం కూడా కొన్ని నెలల క్రితమే పూర్తయ్యింది.

గరిష్ఠంగా ఆరేళ్లు..

కొత్త బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఆఫీస్​-బేరర్లైన.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్​ సెక్రటరీ, కోశాధికారులు వరుసగా ఆరేళ్ల పాటు పదవీకాలాలు పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల పాటు కూలింగ్​ ఆఫ్​ పీరియడ్​లోకి వెళ్తారు. అయితే ఈ నిబంధన బీసీసీఐతో పాటు రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లకు వర్తిస్తుంది.

మూడేళ్ల కూలింగ్​ ఆఫ్​ పీరియడ్​ తర్వాత తిరిగి పదవి చేపట్టడానికి అర్హులు. లోథా కమిటీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి బీసీసీఐలో గరిష్ఠంగా తొమ్మిదేళ్లు, రాష్ట్ర క్రికెట్​ సంఘాల్లో మరో తొమ్మిదేళ్లు ఆఫీసు బేరర్​గా పనిచేయొచ్చు. కొత్త రాజ్యాంగంలోని ఏడు కీలకమైన నియమాల మార్పులలో ఇదొకటి. ఇది సవరిస్తే ప్రస్తుత ఆఫీసు బేరర్లను కొనసాగించడానికి అనుమతిస్తుంది.

ఇదీ చదవండి:ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సెమీస్​లోకి సెరెనా

ABOUT THE AUTHOR

...view details