తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వాతి కమింగ్'​కు చిందులేసిన సన్​రైజర్స్​ ఆటగాళ్లు - భువనేశ్వర్ కుమార్

సన్​రైజర్స్​ సారథి వార్నర్​తో సహ టీమ్ ఆటగాళ్లు భువనేశ్వర్​, రషీద్​ ఖాన్ చిందులేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తమిళ హీరో విజయ్​ నటించిన 'మాస్టర్​' సినిమాలోని వాతి కమింగ్ పాటకు ఈ ముగ్గురు చిందులేస్తూ కనిపించారు. ​ ​

Sunrisers players splattered to vathi coming song
'వాతి కమింగ్'​కు చిందులేసిన సన్​రైజర్స్​ ఆటగాళ్లు

By

Published : Apr 12, 2021, 3:24 PM IST

ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్, సన్​రైజర్స్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​కు​ క్రికెట్​ అంటే ఎంత ఇష్టమో.. డ్యాన్స్ అన్న అంతే మక్కువ. తాజాగా తన ఐపీఎల్​ సహచరులతో కలిసి చిందులేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:వైరల్​: 'మాస్టర్​' పాటకు స్టెప్పులేసిన భారత క్రికెటర్లు​

తమిళ హీరో విజయ్​ నటించిన 'మాస్టర్'​ సినిమాలోని వాతి కమింగ్​ పాటకు వార్నర్​ డ్యాన్స్​లేస్తూ కనిపించాడు. ముందు వార్నర్​ ఈ పాటకు చిందులేయగా.. తర్వాత అతనితో భువనేశ్వర్​ కుమార్, రషీద్​ ఖాన్​ జతకలిశారు. ఈ వీడియోను సన్​రైజర్స్​ హైదరాబాద్​ తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది.

ఇదీ చదవండి:'వాతి కమింగ్'కు పంచెకట్టులో రైనా చిందులు

ABOUT THE AUTHOR

...view details