సెప్టెంబరు 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కాబోతుంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో తన దృష్టిలో ముంబయి ఇండియన్స్ తుది జట్టును ఎంపిక చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. జట్టులో స్పిన్నర్లు లేకపోవడం, మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉండటం వంటి రెండు సమస్యలు ఉన్నాయని గావస్కర్ అన్నాడు.
"ఓపెనర్లుగా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ బరిలో దిగుతారని ప్రధానకోచ్ మహేలా జయవర్ధనే ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ లేదా నాలుగో స్థానంలో ఆడొచ్చు. ఇషాన్ తర్వాత కిరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలను ఎంపిక చేయొచ్చు. స్పిన్నర్ల విభాగంలో కృనాల్, రాహుల్ చాహర్‌లు ఉపయోగపడతారు. బౌలింగ్ లైనప్‌లో కల్టర్నీల్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ మెక్క్లెనిగన్ ఉంటారు."