తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా బౌలర్లకు స్మిత్​ స్వీట్ ​వార్నింగ్​! - స్టీవ్​ స్మిత్​ వార్తలు

ప్రాక్టీసుతో తిరిగి గాడిలో పడ్డానని చెప్పిన ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్మిత్.. టీమ్​ఇండియా బౌలింగ్​ను సులభంగా ఆడతానని అన్నాడు. మరింత మెరుగ్గా ఆడటంలో భాగంగా నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు.

Steve Smith sends warning signal to India, says has 'found his hands' again
టీమ్ఇండియా బౌలర్లకు స్మిత్​ స్వీట్ ​వార్నింగ్​!

By

Published : Nov 24, 2020, 11:28 AM IST

ఐపీఎల్​లో సరిగ్గా బ్యాటింగ్​ చేయలేకపోయానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్ అన్నాడు. గత కొన్ని నెలలుగా సరైన ఇన్నింగ్స్​​ ఆడకపోవడం వల్ల నిరుత్సాహానికి గురైనట్లు చెప్పాడు. ప్రస్తుతం తిరిగి ఫామ్​లోకి వచ్చినట్లు ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. త్వరలో ప్రారంభమయ్యే సిరీస్​లో టీమ్ఇండియా బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశాడు.

"ఐపీఎల్​లో ఈసారి బ్యాటింగ్​ చేసినప్పుడు కొంచెం నిరుత్సాహానికి గురయ్యాను. అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడలేకపోయాను. కానీ, కొన్ని రోజులుగా నా బ్యాటింగ్​లో మార్పు కనిపించింది. దీనిని నా సన్నిహితులు గమనించారు. ఈ విషయం చాలా ఆనందాన్నిచ్చింది. బ్యాటింగ్​ తీరు మెరుగవ్వడానికి నేను నాలుగు నెలలుగా చేస్తున్న ప్రయత్నంలో ఇప్పుడే సరైన ఫలితాన్ని అందుకోగలిగాను. మరోసారి నెట్స్​లో ప్రాక్టీసు చేసి, నా బ్యాటింగ్​ను బలోపేతం చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"

- స్టీవ్​ స్మిత్​, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​

న్యూజిలాండ్​ బౌలర్​ నీల్​ వాగ్నెర్​లా.. టీమ్​ఇండియా పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా తనను బౌన్సర్లతో ఇబ్బంది పెట్టొచ్చనే వ్యాఖ్యలను స్మిత్​ తోసిపుచ్చాడు. వాగ్నెర్​లో మంచి బౌలింగ్ నైపుణ్యం ఉందని ప్రశంసించాడు. అతనిలా టీమ్​ఇండియా బౌలర్లు ఆడలేరని అన్నాడు. "రోజంతా పరుగెత్తి బౌన్సర్లు వేయగల బౌలర్లు(టీమ్​ఇండియాలో) ఎవరూ లేరు. కానీ, నీల్​ వాగ్నెర్​ మాత్రం అందుకు విభిన్నం" అని స్మిత్​ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details