కొన్నేళ్లుగా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. లాక్డౌన్ ప్రభావంతో టిక్‌టాక్ వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే భారత్ వ్యాప్తంగా ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఇదే బాటలోకి త్వరలో తాను వస్తానని అంటున్నాడు స్టీవ్ స్మిత్. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వార్నర్ టిక్‌టాక్ వీడియోలు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగ్గా? నవ్వుతూ, తాను త్వరలోనే టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పుకొచ్చాడు.
"లాక్డౌన్లో వార్నర్ చాలా బిజీ అయిపోయాడు. టిక్‌టాక్ వీడియోలతో భారత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. త్వరలోనే నన్ను కూడా మీరు ఈ మ్యూజిక్ షేరింగ్ యాప్‌లో చూస్తారు"