తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా గడ్డపై టీమ్​ఇండియా కన్నేసిన రికార్డులివే..! - విరాట్​ కోహ్లీ పరుగుల రికార్డులు

ఆస్ట్రేలియాతో 2018-19లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్​లో టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించింది. అదే ఉత్సాహంతో మరోసారి కంగారూలపై ఆధిపత్యం చెలాయించేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. నవంబర్​ 27 నుంచి ఆసీస్​తో జరగనున్న వన్డే సిరీస్​లో భారత ఆటగాళ్లు సాధించగలిగే రికార్డులేవో పరిశీలిద్దాం.

Stats to look out for as India prepare to take on Australia in ODIs
ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా సాధించగలిగే రికార్డులివే!

By

Published : Nov 25, 2020, 12:33 PM IST

2018-19లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా సత్తా చాటింది. కంగారూల గడ్డపై టెస్టు సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది కూడా ఆసీస్​పైనా ఆధిపత్యం చెలాయించడానికి కోహ్లీసేన సన్నద్ధమవుతోంది. ఆసీస్​తో భారత్​ చివరిసారిగా ఆడిన పరిమిత ఓవర్ల సిరీస్​లో.. విరాట్​ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్​ సహా పలువురు యువ క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే ఆస్ట్రేలియాతో ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్​లో.. భారత జట్లు ఆటగాళ్లు సాధించగల రికార్డులేవో చూద్దాం..

బ్యాటింగ్​లో రికార్డులు

  • ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తి మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్. ఆ​ తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు. కంగారూలపై విరాట్​ ఇప్పటివరకు 8 శతకాలను నమోదు చేశాడు. ఈ నెలాఖరున జరగనున్న వన్డే సిరీస్​లో కోహ్లీ మరో 2 సెంచరీలు చేస్తే సచిన్​ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. దీంతో పాటు ఒకే జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగానూ విరాట్​ నిలుస్తాడు.
  • అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 70 సెంచరీలతో విరాట్​ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ వన్డే సిరీస్​లో మరో రెండు శతకాలు నమోదు చేస్తే.. రికీ పాంటింగ్​ను అధిగమిస్తాడు.
  • ఈ పర్యటనలో విరాట్​ కోహ్లీ మూడు సెంచరీలు సాధిస్తే.. అన్ని ఫార్మట్లలో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్​మన్​గా నిలుస్తాడు. సచిన్.. ఆస్ట్రేలియాపై​ 20, శ్రీలంకపై 17 సెంచరీలు చేసి ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డాన్​ బ్రాడ్​మన్​​ ఇంగ్లాండ్​పై 19 శతకాలను నమోదు చేశాడు. ఆసీస్​పై అన్ని ఫార్మట్లలో కలిపి కోహ్లీ 15 సెంచరీలు చేశాడు.
  • వన్డే క్రికెట్​లో వేయి పరుగుల మైలురాయిని చేరుకోవడానికి హార్దిక్​ పాండ్య మరో 43 పరుగులు చేయాల్సి ఉంది. వన్డేల్లో 54 మ్యాచ్​లు ఆడిన హార్దిక్​.. 29.91 సగటున 957 పరుగులను నమోదు చేశాడు.
  • ఆస్ట్రేలియాపై విరాట్​ కోహ్లీ మరో 43 పరుగులు నమోదు చేస్తే.. వన్డేల్లో ఆసీస్​ జట్టుపై అత్యధిక రన్స్​ చేసిన ఆటగాడిగా ఇంగ్లాండ్​ కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్​ను అధిగమిస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 40 మ్యాచ్​ల్లో 1910 స్కోరు నమోదు చేశాడు. 3077 రన్స్​తో ఈ జాబితాలో సచిన్​ తెందూల్కర్​ అగ్రస్థానంలో ఉన్నాడు.
  • ఆస్ట్రేలియాపై 2 వేల పరుగులు నమోదు చేయడానికి టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ మరో 90 రన్స్​ చేయాల్సి ఉంది. ఇలా చేస్తే ఆ జట్టుపై రెండు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానానికి చేరుతాడు.
  • వన్డే క్రికెట్​లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీ మరో 133 రన్స్​ చేయాల్సిఉంది. దీంతో అతి తక్కువ సమయంలోనే వేగంగా ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 12 వేల పరుగులను చేరుకోవడానికి సచిన్​ 300 ఇన్నింగ్స్​ ఆడాడు. ప్రస్తుతానికి సచిన్ ఇందులో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 239 ఇన్నింగ్స్​ మాత్రమే ఆడటం విశేషం.
  • వన్డేల్లో వేయి పరుగులను చేరడానికి టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ శ్రేయస్​ అయ్యర్​ మరో 252 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. తర్వాతి రెండు ఇన్నింగ్స్​లలో ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మరో ఆటగాడిగా శ్రేయస్​ అయ్యర్​ నిలుస్తాడు.
  • వన్డే క్రికెట్​లో 1500 పరుగుల మైలురాయిని చేరడానికి కేఎల్ రాహుల్​ మరో 261 రన్స్​ చేయాల్సి ఉంది. అయితే ఈ ఆస్ట్రేలియా సిరీస్​లోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. కోహ్లీ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
  • వన్డేల్లో 6 వేల పరుగులను నమోదు చేయడానికి ఓపెనర్​ శిఖర్​ ధావన్​ మరో 312 రన్స్​ చేయాలి. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​లో ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యధిక వేగంగా 6 వేల పరుగులకు చేరిన ఆటగాళ్ల జాబితాలో హషీమ్​ ఆమ్లా, విరాట్​ కోహ్లీ తర్వాత ఈ ఫీట్​ సాధిస్తాడు.

బౌలింగ్​లో రికార్డులు

  • వన్డే చరిత్రలో టీమ్​ఇండియా మాజీ బౌలర్​ అజిత్​ అగార్కర్​.. 12 సందర్భాల్లో నాలుగు వికెట్లు ఒకసారి సాధించాడు. పేసర్​ మహ్మద్​ షమి ఇప్పటివరకు అలా 10 సందర్భాల్లో సాధించాడు. మరో రెండు సార్లు నాలుగు వికెట్లను పడగొడితే అగార్కర్​ రికార్డును షమి సమం చేస్తాడు.
  • టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా.. తన పేరు మీద 21 స్టంపింగ్స్​ చేశాడు. మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సచిన్​ తెందూల్కర్​లు 22 స్టంపింగ్స్​ చేశారు. జడేజా మరో రెండు స్టంపింగ్స్​ సాధిస్తే వీరిద్దరిని అధిగమిస్తాడు.
  • వన్డేల్లో 150 వికెట్లు చేరాలంటే మహ్మద్​ షమి మరో 6 వికెట్లు సాధించాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​లో 6 వికెట్లు పడగొడితే.. వేగంగా ఈ మైలురాయిని చేరిన బౌలర్​గా మూడోస్థానంలో చేరడం సహా ట్రెంట్​ బౌల్ట్​ను అధిగమిస్తాడు.
  • వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి యుజ్వేంద్ర చాహల్​ మరో 9 వికెట్లను పడగొట్టాల్సి ఉంది. ఆసీస్​తో జరిగే సిరీస్​లో ఇలా చేస్తే.. మహ్మద్​ షమిని అధిగమించడం సహా అత్యధిక వేగంగా వంద వికెట్లు సాధించిన భారతీయ బౌలర్​గా నిలుస్తాడు.
  • రవీంద్ర జడేజా తాను ఆడిన 165 వన్డేల్లో 187 వికెట్లను సాధించాడు. మరో 13 వికెట్లు పడగొడితే 200 మైలురాయికి చేరుతాడు.

ABOUT THE AUTHOR

...view details