శ్రీలంక క్రికెట్ జట్టులోని దాదాపు 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు వెనకడుగు వేశారు. ఈ నిర్ణయం వెనుక భారత్ హస్తం ఉందన్న పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారులంక క్రీడాశాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో. భద్రత కారణాల దృష్ట్యా క్రికెటర్లు సందిగ్ధంలో ఉన్నారని ట్వీట్ చేశారు.
"శ్రీలంక క్రికెటర్లను భారత్ ప్రభావితం చేసిందన్న ఆరోపణల్లో నిజం లేదు. 2009లో జరిగిన బాంబు దాడి వల్లే జట్టులోని కొంత మంది ఆటగాళ్లు పాక్ వెళ్లేందుకు నిరాకరించారు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ఎవరైతే పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారో వారినే ఎంపిక చేశాం. మా జట్టు బలంగా ఉంది. పాక్‌ను వారి దేశంలోనే ఓడిస్తాం".
-- హరిన్ ఫెర్నాండో, శ్రీలంక క్రీడాశాఖ మంత్రి