శ్రీలంక హెడ్ కోచ్ చండికా హతురుసింగాపై వేటు వేసింది లంక క్రికెట్ బోర్డు. అతడి స్థానంలో తాత్కాలిక కోచ్‌ను నియమించింది. రానున్న న్యూజిలాండ్ సిరీస్‌లో హతురుసింగాకు బదులు లంక మాజీ బౌలర్ రమేశ్ రత్ననాయకేకు బాధ్యతలు అప్పగిస్తునట్లు బోర్డు ఛైర్మెన్ షమ్మీ సిల్వా తెలిపారు.
"న్యూజిలాండ్ సిరీస్‌లో హతురుసింగా ప్రమేయం ఉండదు. చట్టపరంగా ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు తొలగింపునకు గల కారణాలు ఇప్పుడే ఏం చెప్పలేం" -షమ్మి సిల్వా, లంక క్రికెట్ బోర్డు ఛైర్మెన్.
ఆగస్టు 14న న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది శ్రీలంక. ఈ సిరీస్‌కు హతురుసింగా దూరంగా ఉండాలని లంక క్రీడా మంత్రి హరీన్ ఫెర్నాండో ఈ నెల ప్రారంభంలోనే తెలిపారు. కొత్త కోచ్‌కు అవకాశమివ్వాలని సూచించారు.