కేరళలోని కొచ్చిలో క్రికెటర్ శ్రీశాంత్ ఇంటిలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. మంటలకు ఓ గది పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో శ్రీశాంత్ భార్య, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వారు క్షేమంగా బయటపడ్డారు. అగ్నిప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే గాంధీనగర్, త్రిక్కక్కరలోని అగ్నిమాపక దళాలు... సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశాయి.
శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం - కేరళ పేసర్
భారత క్రికెటర్ శ్రీశాంత్ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ప్రాణ, ఆస్తి నష్టం తప్పించారు.
శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
ఇటీవలే ఈ కేరళ పేసర్‌పై జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది బీసీసీఐ. తాజాగా అంబుడ్స్‌మెన్ డీకే జైన్ ఇచ్చిన ఆదేశాలతో 2020 ఆగస్టులో మళ్లీ క్రికెట్ ఆడనున్నాడు శ్రీశాంత్.
ఇదీ చదవండి...'స్వలాభం కోసం కొంతమంది నాకు మద్దతివ్వలేదు'
Last Updated : Sep 28, 2019, 2:39 AM IST