తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విజ్ఞాన శాస్త్రంలో ఓటమి లేదు.. విజయం తప్ప'

చంద్రయాన్​-2 ప్రయోగంలో ఇబ్బంది తలెత్తడం వల్ల నిరాశలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచింది క్రీడా సమాజం. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుందంటూ శాస్త్రవేత్తలను ఉద్దేశించి పలువురు క్రీడాకారులు ట్వీట్టర్ ద్వారా తమ మద్దతు తెలిపారు.

విరాట్ కోహ్లీ

By

Published : Sep 7, 2019, 1:41 PM IST

Updated : Sep 29, 2019, 6:30 PM IST

ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్​-2 ప్రయోగంలో విక్రమ్​ ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలిచింది భారత క్రీడా సమాజం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తీరతారని ఆశాభావం వ్యక్తం చేసింది.

"విజ్ఞానశాస్త్రంలో ఓటమి అనేదే లేదు. మనం ప్రయోగం చేయాలి.. విజయం సాధించాలి. ఎన్నో రాత్రిళ్లు కష్టించి పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను గౌరవిస్తున్నాం. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. జైహింద్" -విరాట్​ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.

విరాట్ కోహ్లీ

"మీ కఠోర శ్రమ, పట్టుదలను చూసి గర్విస్తున్నాం. మీరు ఓడిపోలేదు. భవిష్యత్తులో మనం మరిన్ని విజయాలు అందుకుంటాం. కలను అలాగే సజీవంగా ఉంచండి" -శిఖర్ ధావన్, టీమిండియా ఓపెనర్

శిఖర్ ధావన్

"ఓటమి అనేది ఎక్కడా లేదు. పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళ్లడమే మార్గం. ఇస్రో బృందం.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. మీ పట్టుదలకు, అంకితభావానికి సెల్యూట్" - రిషభ్ పంత్​, టీమిండియా క్రికెటర్

రిషభ్ పంత్

"మన శాస్త్రవేత్తలను చూస్తే గర్వంగా ఉంది. భవిష్యత్తులో తప్పక విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. జైహింద్" - యోగేశ్వర్ దత్, రెజ్లర్"

యోగేశ్వర్ దత్

"అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్​ను సారథిగా నిలబెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నాం. చంద్రయాన్-2 ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. జైహింద్" - రవిశాస్త్రి, టీమిండియా కోచ్

రవిశాస్త్రి

"ప్రయత్నించేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నాం. హిందుస్థాన్ జిందాబాద్" -హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్

హర్భజన్ సింగ్
సురేశ్ రైనా
యువరాజ్ సింగ్

చంద్రయాన్-2 కాసేపట్లో జాబిల్లిపై సురక్షితంగా దిగుతుందన్న దశలో ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది 'విక్రమ్ ల్యాండర్'. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా అంతరిక్ష కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి.

ఇది చదవండి: పాక్ దిగ్గజ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ హఠాన్మరణం

Last Updated : Sep 29, 2019, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details