పింక్ టెస్టుకు వేదికైన మొతేరా పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని విశ్లేషకులు భావిస్తుండగా.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పేసర్లకూ అవకాశాలు కొట్టి పారేయలేమని పేర్కొన్నాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 ఆధిక్యంతో ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే పునఃనిర్మించిన మొతేరా మైదానం.. స్పిన్‌కు సహకరిస్తుందా? లేదా సీమ్‌కు కలిసొస్తుందా? అనేది ప్రధానాంశమైంది.
బంతి పాతబడేంత వరకు స్వింగ్‌కు సహకరిస్తుందనేది కోహ్లీ అంచనా. "బంతి కచ్చితంగా స్వింగ్ అవుతుందా అనేది తెలియదు. కానీ, పేసర్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఎరుపు బంతితో పోలిస్తే గులాబీ బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. 2019లో బంగ్లాదేశ్‌తో ఆడిన పింక్ టెస్టు ద్వారా మాకు ఈ విషయం అర్థమైంది" అని భారత కెప్టెన్ చెప్పాడు.
బంతి ఒకవేళ సీమ్‌కు అనుకూలిస్తే.. అది తమకు కలిసొస్తుందన్న ఇంగ్లాండ్ జట్టు అంచనాపై కోహ్లీ స్పందించాడు.
"పర్యటక జట్టులోనూ చాలా బలహీనతలు ఉన్నాయి. ఇంగ్లాండ్ టీమ్ బలాలు, బలహీనతల గురించి మాకు అవసరం లేదు. గతంలో వారి దేశంలోనే వారిని ఓడించాము. ఒకవేళ పిచ్ పేసర్లకు సహకరిస్తే అది వారికి మాత్రమే కాదు.. మాక్కూడా ఉపయోగమే. కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఇరు జట్లకు చాలా విషయాలపై అవగాహన లేదు. పేసర్లకు, స్పిన్నర్లకు పింక్ బాల్ ఎలా సహకరిస్తుందనే దానిపైనే ఇండియా బలం ఆధారపడి ఉంది. మా జట్టులోనూ అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. ఏది ఎలా ఉన్నా మేము ఆడటానికి సిద్ధమే"
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.
"ఎరుపు బంతితో పోలిస్తే గులాబీ బంతితో ఆడటం సవాలుతో కూడినది.. దీనికి పిచ్‌తో సంబంధం లేదు. ఈ టెస్టులో స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషిస్తారనేది వాస్తవమే. కానీ, కొత్త బంతితో బౌలింగ్ చేసేటప్పుడు పేసర్ల పాత్రను తీసిపారేయలేము' అని అన్నాడు విరాట్.
మొతేరా పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఇదివరకే తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి:విజయ్ హజారే ట్రోఫీలో కరోనా కలకలం