ఈ ఏడాది ఐపీఎల్‌కు తాను అందుబాటులో ఉండట్లేదని వెల్లడించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ డేల్ స్టెయిన్(దక్షిణాఫ్రికా). కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
"ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడట్లేదు. అలా అని వేరే జట్టు తరఫున కూడా ఆడను. కేవలం విరామం తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. వేరే లీగుల్లో ఆడతా. ఇప్పుడే రిటైర్ అవ్వను"