ప్రపంచకప్ వరుస విజయాలతో దూసుకుపోతోంది న్యూజిలాండ్. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. ఈ రెండు జట్లు బర్మింగ్హమ్ వేదికగా నేడు తలపడనున్నాయి. 2015 వరల్డ్ కప్ సెమీస్‌లో తమ ఓటమికి కారణమైన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సఫారీ జట్టు.
ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఆఫ్గానిస్థాన్‌పై మాత్రమే గెలిచింది దక్షిణాఫ్రికా. సెమీస్ ఆశల్ని సజీవం చేసుకోవాలంటే మిగతా వాటిలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. పేసర్ ఎంగిడి గాయం నుంచి కోలుకోవడం కలిసొచ్చే అంశం.
ఆడిన నాలుగింటిలోనూ మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది కివీస్. ఈ పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లాలని భావిస్తోంది. కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు మన్రో, గప్తిల్ మెరవాల్సిన అవసరముంది. మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించేందుకు ఆల్‌రౌండర్స్ జిమ్మీ నీషమ్, గ్రాండ్‌హామ్ ఉండనే ఉన్నారు.