తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ హెల్త్ అప్​డేట్.. మెరుగ్గా ఆరోగ్యం

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ హెల్త్​ బులిటిన్​ను ఆదివారం ఉదయం వైద్యులు ప్రకటించారు. ప్రసుతం దాదా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Sourav Ganguly stable, decision on further angioplasty soon
సౌరవ్​ గంగూలీ ఆరోగ్యంపై వైద్యుల అప్​డేట్​

By

Published : Jan 3, 2021, 11:47 AM IST

గుండెపోటుతో శనివారం ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ హెల్త్​ బులిటిన్​ను వైద్యులు విడుదల చేశారు. దాదా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

"గంగూలీ రాత్రి కొంచెం అసౌకర్యంగా కనిపించారు. గతరాత్రితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం ఆయన నిద్రిస్తున్నారు" అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రక్తపోటు (110/70), ఆక్సిజన్​ స్థాయి కంట్రోల్​లో ఉన్నట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఈసీజీ నిర్వహించామని డాక్టర్లు చెప్పారు.

"గుండె రక్తనాళాల వ్యాధి కారణంగా గంగూలీకి మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సిఉంటుంది. అది కూడా తన ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయాలి. ప్రస్తుతం ఆయనకు పెద్దగా ప్రమాదమేమి లేదు" అని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

ఇదీచూడండి:బ్రిస్బేన్​ టెస్టులో టీమ్​ఇండియా ఆడడం సందేహమే!

ABOUT THE AUTHOR

...view details