తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నీ మద్దతు​కు ధన్యవాదాలు.. ఐ లవ్ యూ'​ - ashes

వివాహం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా తన భార్య డ్యాని విల్లిస్​కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు స్టీవ్ స్మిత్. ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్​స్టాలో షేర్ చేశాడు.

స్మిత్

By

Published : Sep 15, 2019, 6:09 PM IST

Updated : Sep 30, 2019, 5:49 PM IST

ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన భార్య డ్యాని విల్లిస్​కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్​ కోసం ఇంగ్లాండ్​లో ఉన్ స్మిత్ వివాహమై ఏడాదైన సందర్భంగా ఇన్​స్టాలో ఓ ఫొటో షేర్ చేశాడు.

"వివాహమై ఏడాది పూర్తయిన సందర్భంగా నీకు (డ్యాని విల్లిస్​) పెళ్లి రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ" -స్టీవ్ స్మిత్ ఇన్​స్టా పోస్ట్​.

చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్న స్మిత్ - డ్యాని గతేడాది సెప్టెంబరు 15న వివాహం ద్వారా ఒక్కటయ్యారు. జులై 2017లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్ సిరీస్​లో స్మిత్ అదరగొడుతున్నాడు. 125.16 సగటుతో 751 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు.. మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: అక్కడ 'బాహుబలి'ని బీట్ చేసిన 'సాహో'

Last Updated : Sep 30, 2019, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details