భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం బాగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్. కాసేపు కూడా క్రికెట్‌ను వదిలి విరామం తీసుకోవడం కష్టంగా ఉన్నట్లు చెప్పాడు. అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని గంటల పాటు విరామం తీసుకోవడం తప్పనిసరి అని అన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
"టెస్టు మ్యాచ్ కోసం సన్నాహకాలు చేస్తున్నా.. కొంత విరామం తీసుకోవడం అనేది చాలా అవసరం. అది ఓ గంటైన పర్లేదు. కానీ ఇలా క్రికెట్‌ను ఊహించుకోకుండా, బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం నాకు కష్టంగానే ఉంటుంది" అని ట్వీట్ చేశాడు స్మిత్.