తెలంగాణ

telangana

ETV Bharat / sports

అది సిగ్గుచేటు: బ్యాటింగ్​ గార్డ్​ వివాదంపై స్మిత్ స్పందన​

టీమ్​ఇండియా బ్యాట్స్​మన్ రిషబ్​ పంత్​ గార్డ్​ మార్క్​ను చెరిపివేశాడనే ఆరోపణలపై ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్​ స్పందించాడు. తనపై అలాంటి నిందలు రావడం ఎంతో బాధను కలిగిస్తుందని వెల్లడించాడు. గార్డ్​మార్క్​ను సరిచేయడం అది అలవాటులో వచ్చిందే తప్పా.. కావాలని చేయలేదని స్పష్టం చేశాడు.

Smith denies accusations of gamesmanship during third Test
అది సిగ్గుచేటు: బ్యాటింగ్​ గార్డ్​ వివాదంపై స్మిత్ స్పందన​

By

Published : Jan 13, 2021, 6:35 AM IST

డ్రింక్స్‌ బ్రేక్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ రిషబ్​ పంత్ గార్డ్‌ మార్క్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ చెరిపివేశాడని ఆరోపణలున్నాయి. వక్రబుద్ధితో స్మిత్ అలా చేశాడని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై స్మిత్ స్పందించాడు. తనపై ఇలాంటి నిందలు రావడం ఎంతో బాధగా ఉందని అన్నాడు.

"నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ.. క్రీజులో ‌గార్డు మార్క్‌ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ, టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది."

- స్టీవ్​స్మిత్​, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​

ఈ విషయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కూడా స్మిత్‌కు మద్దతుగా నిలిచాడు. ప్రతి మ్యాచ్‌లో స్మిత్ క్రీజు వద్దకు వెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్‌ మార్క్‌ను మార్చుకుంటాడని తెలిపాడు. అతడిది దురుద్దేశమైతే టీమిండియా ఫిర్యాదు చేసేది కదా? అని అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. బ్రిస్బేన్‌ వేదికగా జనవరి 15న ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:ఆసీస్​తో నాలుగో టెస్టుకు అందుబాటులో సెహ్వాగ్​!

ABOUT THE AUTHOR

...view details