టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్... సెంచరీల మోత మోగిస్తున్నాడు. యాషెస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో శతకం సాధించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో 26వ శతకం నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (25 టెస్టు సెంచరీలు) రికార్డుని బద్దలుకొట్టాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మంచి ఫామ్‌లో ఉన్నాడీ ఆటగాడు.
కోహ్లీకి మరో ఝలక్ ఇచ్చిన స్మిత్ - smith another century in ashes
టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్... మరోసారి విరాట్‌కు ఝలక్ ఇచ్చాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌లో మరో సెంచరీ చేసి కోహ్లీ శతకాల రికార్డును అధిగమించాడు.
కోహ్లీకి మరో ఝలక్ ఇచ్చిన స్మిత్
తాజా శతకంతో ఇంగ్లాండ్‌పై అత్యధిక శతకాలు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ (19) ఉన్నాడు. తర్వాతి స్థానంలో ఉన్న స్మిత్.. 11 సెంచరీలతో కొనసాగుతున్నాడు.
ఇదీ చదవండి..."రాహుల్‌కు ఏమైంది..?" మాజీల ఆందోళన
Last Updated : Sep 29, 2019, 1:59 PM IST