తెలంగాణ

telangana

ETV Bharat / sports

శుభ్​మన్​కు వన్డేల్లో చోటు కల్పించాలి: హాగ్

టీమిండియా యువ ఆటగాడు శుభ్​మన్​ గిల్​పై ఆసీస్ క్రికెటర్ బ్రాడ్ హాగ్​ ప్రశంసలు కురిపించాడు. గిల్​కు జట్టులో చోటు కల్పిస్తే భారత మిడిలార్డల్​ బలంగా తయారవుతుందని తెలిపాడు.

హాగ్

By

Published : Aug 11, 2019, 6:51 AM IST

వెస్టిండీస్-ఏతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్​లో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా యువ ఆటగాడు శుభ్​మన్​ గిల్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్​ హాగ్​ శుభ్​మన్​ ప్రతిభను కొనియాడాడు. ఇంత ప్రతిభ గల ఆటగాడిని టీమిండియా మిడిలార్డర్​లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు.

"శుభ్​మన్​ ఖాతాలో మరో డబుల్ సెంచరీ. టీమిండియా వన్డే జట్టులో ఆలస్యమైనా ఇతడికి చోటు కల్పించాలి. ఫలితంగా భారత మిడిలార్డర్ బలంగా తయారవుతుంది." అంటూ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు బ్రాడ్ హాగ్​.

వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో గిల్​కు అవకాశం దక్కలేదు. ఈ విషయంపై ఆవేదనను వ్యక్తం చేశాడీ యువ క్రికెటర్. మరింత మెరుగ్గా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడతానని అంటున్నాడు.

ఇవీ చూడండి.. సెలక్షన్​ విషయంలో దాదా థియరీకి రహానే జై

ABOUT THE AUTHOR

...view details