వెస్టిండీస్ పర్యటనకు ఎంపికవ్వని టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్-ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో అత్యంత పిన్న వయసు(19 ఏళ్ల 334 రోజులు)లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు గిల్. ఈ మ్యాచ్‌లో 250 బంతుల్లో 204 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడీ యువ క్రికెటర్. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ (20 ఏళ్ల 124రోజులు) పేరిట ఉండేది.
ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ విఫలమైన వేళ కెప్టెన్ హనుమ విహారి(118 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు శుభ్‌మన్. ఈ జోడి ఐదో వికెట్‌కు 315 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు మంచి స్కోరు అందించింది.