టీ20 ఫార్మాట్లో ఎక్కువగా బ్యాట్స్‌మన్ ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకే ఓవర్లో 20 పరుగులకు పైగా సాధించి.. బౌలర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎక్కడో అడపా దడపా మాత్రమే బౌలర్లు రాణించారు. అయితే బంతి, బ్యాట్ మధ్య సమతూకం రావాలంటే.. టీ20 ఫార్మాట్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేర్కొన్నాడు.
ఈ ఫార్మాట్లో బౌలర్ గరిష్ఠంగా నాలుగు ఓవర్లు వేసే నిబంధన తొలగించి ఐదు ఓవర్ల పద్దతిని ప్రవేశపెట్టాలని తెలిపాడు వార్న్. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి కామెంటరీ చేస్తున్న క్రమంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు.