షాహిద్ అఫ్రిది.. ఈ పాకిస్థానీ క్రికెట్ జట్టు మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా తనదైన శైలి బౌండరీలతో విరుచుకుపడే ఈ ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గూగ్లీలతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అఫ్రిది.. జీవితంలోనూ ఇలాంటి ఎన్నో గూగ్లీలను ఎదుర్కొన్నాడు. వీటన్నింటినీ 'గేమ్ ఛేంజర్' అనే పుస్తకంగా తీసుకురానున్నాడు.
'గేమ్ ఛేంజర్' విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయని తెలిపాడు అఫ్రిది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏప్రిల్ 30న పుస్తకాన్ని తీసుకొస్తానని అభిమానులకు వాగ్దానం చేశాడు. ప్రముఖ టీవీ యాంకర్ వజాహత్ ఖాన్ ఈ పుస్తకం రాశారు. అఫ్రిది కెరీర్లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, జరిగిన మోసాలను గురించి ఇందులో వివరించారు.