తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సర్ఫరాజ్​... టెస్టు సారథ్యం నుంచి తప్పుకో' - Sarfaraz Ahmed

పాకిస్థాన్​ క్రికెట్​ కెప్టెన్​ సర్ఫరాజ్​ అహ్మద్​పై ఆ దేశ మాజీలు షాహిద్​ అఫ్రిది, జహీర్​ అబ్బాస్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని అతడికి సూచించారు.

'సర్ఫరాజ్​... టెస్టు సారథ్యం నుంచి తప్పుకో'

By

Published : Sep 20, 2019, 9:24 PM IST

Updated : Oct 1, 2019, 9:20 AM IST

పాకిస్థాన్​ సారథి​ సర్ఫరాజ్​ అహ్మద్​పై ఆ దేశ మాజీ క్రికెటర్లు షాహిద్‌ అఫ్రిది, జహీర్‌ అబ్బాస్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్‌ తప్పుకుంటే దేశ క్రికెట్​కు ఎంతో మేలు జరుగుతుందని ఈ ఇద్దరూ అభిప్రాయపడ్డారు. వన్డే, టీ20లకు కెప్టెన్‌గా మాత్రమే కొనసాగాలని సూచించారు.

అఫ్రిది, జహీర్​ అబ్బాస్​

" టెస్టు సారథ్య బాధ్యతలకు సర్ఫరాజ్​ గుడ్​బై చెప్పెస్తే అతడికే మేలు జరుగుతుంది. మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే చాలా భారం మోస్తున్నట్లే. టీ20, వన్డే క్రికెట్​ సారథిగా సర్ఫరాజ్‌ విజయవంతమయ్యాడు కాబట్టి వాటికే కెప్టెన్​గా కొనసాగితే మంచి ఫలితం ఉంటుంది".
-అఫ్రిది, పాక్ మాజీ​ క్రికెటర్​

మిస్బావుల్​ హక్​ సారథిగా తప్పుకున్నాక 2017 నుంచి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్​గా సర్ఫరాజ్​ వ్యవహరిస్తున్నాడు. ప్రపంచకప్​లో పాక్​ పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన సుదీర్ఘ ఫార్మాట్​ ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్​ జట్టు​ 7వ స్థానానికి దిగజారడంపై మళ్లీ అతడి కెప్టెన్సీపై చర్చ మొదలైంది.

ఇదే అంశంపై పాక్​ లెజెండ్​ క్రికెటర్ జహీర్​ అబ్బాస్​ మాట్లాడాడు. టెస్టు క్రికెట్‌ చాలా కఠినమైనదని... ఈ ఫార్మట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం సవాల్‌తో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు. ఆ సత్తా సర్ఫరాజ్‌కు లేదన్నాడు. వన్డే, టీ20లపై మరింత దృష్టి పెట్టి, టెస్టు సారథ్యం నుంచి తప్పుకుంటే మంచిదని జహీర్‌ సూచించాడు.

ఇదీ చదవండి...

Last Updated : Oct 1, 2019, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details