న్యూజిలాండ్‌తో చివరి టీ20లో భారత యువ క్రికెటర్ సంజు శాంసన్ ఫీల్డింగ్‌లో అద్భుత విన్యాసాలు చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో విఫలమైనా, ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతికి కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ షార్ట్ మిడ్ వికెట్‌లో భారీ షాట్ ఆడాడు. అది సిక్సర్ అని అంతా భావించారు. కానీ శాంసన్ పరిగెత్తుకొంటూ బౌండరీ లైన్ అవతలకు డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలోనే తాను కింద పడడం ఖాయమని భావించి, గాల్లో ఉన్నప్పుడే రెప్పపాటు క్షణంలో బంతిని మైదానంలోకి విసిరేశాడు. దీంతో కివీస్ రెండు పరుగులతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. శాంసన్ సమయస్ఫూర్తి, ఫీల్డింగ్ ప్రతిభను అందరూ మెచ్చుకుంటున్నారు.
శాంసన్ అద్భుత ఫీల్డింగ్.. గాల్లో విన్యాసాలు - ENTERTAINMENT NEWS
భారత్-న్యూజిలాండ్ ఐదో టీ20లో టీమిండియా క్రికెటర్ శాంసన్ అద్భుతం చేశాడు. సిక్స్ వెళ్లాల్సిన బంతిని, సూపర్ స్టంట్ చేసి ఆపేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
భారత యువ క్రికెటర్ సంజు శాంసన్
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్.. ఏడు పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రోహిత్ (60 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (45) రాణించడం వల్ల తొలుత.. టీమిండియా 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఛేదనలో కివీస్ 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులే చేసి, ఓడిపోయింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' బుమ్రా, 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' రాహుల్ దక్కించుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇరుజట్లు తొలి మ్యాచ్ ఆడనున్నాయి.
Last Updated : Feb 29, 2020, 12:07 AM IST