తెలంగాణ

telangana

ETV Bharat / sports

శాంసన్ మంచి మనసు... మైదాన సిబ్బందికి సాయం

భారత యువ క్రికెటర్​ సంజూ శాంసన్​ మంచి మనసు చాటుకున్నాడు. మ్యాచ్​ల ద్వారా వచ్చిన లక్షన్నర ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు.

By

Published : Sep 8, 2019, 4:14 PM IST

Updated : Sep 29, 2019, 9:38 PM IST

శాంసన్ మంచి మనసు... లక్షన్నర సాయం

తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా-ఏతో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు క్రికెటర్ సంజూ శాంసన్. మ్యాచ్ అనంతరం మంచి మనసు చాటుకున్నాడు. వర్షం కారణంగాఈ సిరీస్​లో ఒక్క మ్యాచ్​ కూడా 50 ఓవర్లు జరగలేదు. అయితే మైదానంలోని నీటిని తొలగించి సిరీస్​ సాఫీగా జరిగేందుకు కృషి చేసిన సిబ్బందికి తన ఫీజు మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశాడీ యువ క్రికెటర్.

కేరళ క్రికెట్​ సంఘం పరిధిలోని గ్రీన్​ఫీల్డ్​ స్టేడియం

" ఈ సిరీస్​లో మ్యాచ్​లు సజావుగా జరిగాయంటే అందుకు కారణం మైదాన సిబ్బందే. ఒక వేళ గ్రౌండ్​ తడిగా ఉండుంటే అధికారులు మ్యాచ్ ఆపేసేవారు. కానీ అలా జరగకుండా కష్టపడినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతగా నా మ్యాచ్​ ఫీజును వారికి ఇవ్వాలని నిశ్చయించుకున్నా". -సంజూ శాంసన్​, కేరళ క్రికెటర్​

విన్నింగ్​ హీరో...

ఈ మైదానంలో దక్షిణాఫ్రికా ఏతో జరిగిన చివరి అనధికారిక వన్డేలో సంజూ శాంసన్..​ 48 బంతుల్లో 91 పరుగులు (6 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి సత్తాచాటాడు. ఫలితంగా 4-1 తేడాతో సిరీస్​ సొంతం చేసుకుందిభారత్. ఈ మ్యాచ్​ను వరుణుడు అడ్డుకోవడం వల్ల ఆటను 20 ఓవర్లకు కుదించారు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఏ.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ (3 వికెట్లు/9 పరుగులు) ధాటికి 20 ఓవర్లలో 168 పరుగులకే దక్షిణాఫ్రికా-ఏ ఆలౌటైంది.

ఇదీ చదవండి...బీసీసీఐకి క్రికెటర్ దినేశ్ కార్తీక్ క్షమాపణ లేఖ

Last Updated : Sep 29, 2019, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details