ఐపీఎల్లో తనపై జాతివివక్ష చూపిస్తూ వ్యాఖ్యలను చేశారని ఆరోపించాడు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తాజాగా వెల్లడించాడు. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా సామాజిక మాధ్యమాల్లో చేపట్టిన 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నాపై జాతివివక్ష కలిగిన ఓ కామెంట్ చేశారు. అయితే వాటి అర్థం నాకిప్పుడే తెలిసింది. నన్ను, పెరేరాను అదే విధంగా పిలిచేవారు. అప్పట్లో దాన్ని బలమైన వ్యక్తి అని సంబోధిస్తున్నారని అభిప్రాయపడ్డా. కానీ దానికి అర్థం తెలిసిన తర్వాత నాకు కోపం వచ్చింది".