క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్నాయి. భారతీయ బ్యాట్స్‌మెన్‌లో సచిన్ మాత్రమే కంగారులపై 8 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ 7 సెంచరీలు చేసి రికార్డుకు ఒక్క సెంచరీ దూరంలోనే ఉన్నాడు. 6 సెంచరీలతో కోహ్లి అతని వెనకే ఉన్నాడు. వీరిద్దరు ఈ సిరీస్ ముగిసేలోపు ఈ రికార్డును అధిగమించడం ఖాయమని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
సచిన్ రికార్డు బ్రేక్..? - one day
క్రికెట్ దిగ్గజం, పరుగుల యంత్రం సచిన్ తెందూల్కర్ రికార్డును అధిగమించేందుకు కోహ్లి, రోహిత్ శర్మలకు అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ రికార్డు బ్రేక్ అయ్యేనా..?
సచిన్ రికార్డు బ్రేక్..?
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మొదటి వన్డేలో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసింది టీమిండియా. టీట్వంటీల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ.