తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు ఆర్సీబీకి నాసా సాయం..!

విక్రమ్​ ల్యాండర్​ ఆచూకీని కనుగొన్నందుకు.. నాసాకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

Royal Challengers Bangalore trolled over congratulatory tweet to NASA for finding Vikram Lander debris
విరాట్ - డివిలియర్స్​

By

Published : Dec 3, 2019, 10:53 PM IST

ఇటీవలే చంద్రయాన్​-2 ప్రయోగం విఫలమై విక్రమ్​ ల్యాండర్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. విక్రమ్ జాడ కోసం ఇస్రో, నాసా తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయితే మంగళవారం దీని ఆచుకీని నాసా కనుగొన్నందున పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు యాజమాన్యం కూడా ఉంది. విక్రమ్​ జాడను కనుగొన్నందుకు కృతజ్ఞతలు చెబుతూ నాసాకు ట్వీట్​ చేసింది. అయితే ఇందులో విరాట్​ కోహ్లీ, డివిలియర్స్ కొట్టిన బంతులు కూడా వెతికి పెట్టేందుకు నాసా సాయం చేయాలని చెప్పినందున అది కాస్తా ప్రస్తుతం వైరల్​గా మారింది.

విక్రమ్​ ల్యాండర్​ను కనుగొనడంలో సాయపడ్డ నాసా బృందానికి కృతజ్ఞతలు.. అలాగే డివిలియర్స్, విరాట్ కోహ్లీ కొట్టిన క్రికెట్ బంతులను వెతకడంలోనూ మాకు సాయం చేయండి -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్వీట్

ప్రస్తుతం ఈ ట్వీట్​కు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'బంతి కనిపెట్టడం కాదు.. మ్యాచ్​లు ఎలా గెలవాలో ఆర్​సీబీకి సాయపడండి నాసా' అని

ఒకరు ట్వీట్ చేశారు. 'బలమైన బౌలర్​ను ఆర్​సీబీ కోసం కనిపెట్టండి' అని ఇంకొకరు పోస్ట్ చేశారు. 'ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో ఆర్సీబీకి సాయం చేయండి' అని మరొకరు ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు 12 ఐపీఎల్ సీజన్లు పూర్తయినా బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఈ సారి ఆ జట్టుకు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ డైరెక్టర్​గా నియమితులయ్యారు. అలాగే ఆసీస్ మాజీ బ్యాట్స్​మన్ సైమన్ కటిచ్ ప్రధాన కోచ్​గా బాధ్యతలు తీసుకున్నాడు.

ఇదీ చదవండి: పైన్​కు సాయం చేద్దామనుకున్నా అంతే: స్మిత్​

ABOUT THE AUTHOR

...view details