ఆదివారం కివిస్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఆటగాడు రోహిత్‌శర్మ గాయపడ్డాడు. దీనిపై వికెట్‌కీపర్ కెఎల్ రాహుల్ స్పందించాడు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. రోహిత్ త్వరలోనే మైదానంలో అడుగుపెడతాడని రాహుల్ స్పష్టం చేశాడు. బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ.. కాలి పిక్క పట్టేయటం వల్ల ఆట మధ్యలో మైదానాన్ని వీడాడు. దీంతో రోహిత్ కెప్టెన్ బాధ్యతలను రాహుల్ చేపట్టాడు. మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించాడు కెఎల్ రాహుల్.
'రోహిత్ త్వరలోనే మైదానంలో అడుగుపెడతాడు' - రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌పై జరిగిన ఐదో టీ20లో గాయపడిన రోహిత్ శర్మ.. త్వరలోనే కోలుకుంటాడని కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఫిల్డింగ్కు దిగకపోవడం వల్ల కెప్టెన్ బాధ్యతలను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేపట్టాడు.
'రోహిత్ త్వరలోనే మైదానంలో అడుగుపెడతాడు'
భారత్ బ్యాటింగ్ లైనప్‌లో 1 డౌన్లో దిగిన రోహిత్.. 41 బంతుల్లో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ ఇప్పుడు కుదురుకున్నాడని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని రాహుల్ తెలిపాడు. మరోవైపు బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో రోహిత్‌పై ప్రత్యేక దృష్టి సారించింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బీసీసీఐ కెప్టెన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చింది.
ఇదీ చూడండి..బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు
Last Updated : Feb 28, 2020, 10:36 PM IST