రోహిత్ శర్మ.. ఈ పేరు వింటే మూడు డబుల్ సెంచరీలు, మైదానం నలువైపులా హోరెత్తే బౌండరీలే గుర్తొస్తాయి. ప్రత్యర్థి ఎవరైనా తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే రోహిత్‌ను అభిమానులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ఈ ఆటగాడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీనికనుగుణంగానే రోహిత్‌ను ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్నకు నామినేట్ చేసింది బీసీసీఐ. తాజాగా దీనిపై స్పందించాడు హిట్‌మ్యాన్. బీసీసీఐ ఈ వీడియోను షేర్ చేసింది.
"ఖేల్‌రత్నకు నామినేట్ అవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇది దేశంలో క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం. ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, సహ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, అభిమానులు, కుటుంబానికి రుణపడి ఉంటా."