టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తోన్న తీరుపై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన జట్టులో రోహిత్‌కు స్థానం దక్కకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు మ్యాచ్‌లు గాయం కారణంగా దూరమైన మయాంక్ అగర్వాల్‌ను మూడు ఫార్మాట్లలోకి తీసుకున్న సెలక్షన్ కమిటీ.. రోహిత్‌కు ఎందుకు స్థానం కల్పించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ తీసుకున్న ఓ నిర్ణయం ఫ్యాన్స్‌ను మరింత అయోమయానికి గురి చేస్తోంది.
'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలగించిన రోహిత్ - రోహిత్ శర్మ తాజా వార్తలు
టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సామాజిక మాధ్యమాల బయో నుంచి 'ఇండియన్ క్రికెటర్' అనే పదాన్ని తొలగించాడు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు తలెత్తున్నాయి.
'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలగించిన రోహిత్
సామాజిక మాధ్యమాల్లో రోహిత్ అకౌంట్ బయోలో 'ఇండియన్ క్రికెటర్' అని ఉండేది. కానీ ఈరోజు ఆ పదాన్ని తొలగించాడు హిట్‌మ్యాన్. అందుకు గల కారణం స్పష్టంగా తెలియకపోయినా.. ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయనందుకే ఇలా చేశాడని భావిస్తున్నారు.