తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ భారీ సిక్సర్.. ఎవరికి తగిలిందో తెలుసా? - rohit sharma big hits in practice

సిక్సర్లకు పెట్టింది పేరైన రోహిత్​శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్​ కోసం సన్నాహాల్లో ఉన్నాడు. తాజాగా జట్టుతో కలిసి ప్రాక్టీస్​ చేస్తున్న హిట్​మ్యాన్​ భారీ సిక్సర్​ బాదాడు. అది కాస్తా వెళ్లి కదులుతున్న బస్సుపై పడింది.

rohit sharma hit 95 meters six in pracitising sessions for ipl 2020
రోహిత్​ భారీ సిక్సర్... ఎవరికి తగిలిందో తెలుసా..?

By

Published : Sep 9, 2020, 8:12 PM IST

రోహిత్​శర్మ.. ఆ పేరు చెప్తే టక్కున గుర్తొచ్చేవి భారీ సిక్సర్లు, స్కోర్​ బోర్డుపై పరుగెత్తే అంకెలు. అయితే ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం యూఏఈలో ఉన్నాడు ఈ స్టార్​ ప్లేయర్. జట్టుతో కలిసి శిక్షణలో ఉన్న హిట్​మ్యాన్​.. ప్రాక్టీస్​ మ్యాచ్​లో ఓ భారీ సిక్సర్​ కొట్టాడు. 95 మీటర్ల దూరం వెళ్లిన ఆ బంతి.. రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. తాజాగా ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. ముంబయి ఇండియన్స్​ ఫ్రాంఛైజీ.

"బ్యాట్స్​మెన్​ సిక్సర్లు కొడతారు. లెజెండ్​లు స్టేడియం బయటికే సిక్సర్​ బాదేస్తారు. హిట్​మ్యాన్​ ఈ రెండింటితో పాటు కదులుతున్న బస్సుపైనా బంతి పడేలా చేయగలడు" అంటూ ఆ పోస్టుకు సరదాగా సందేశాన్ని జోడించింది ముంబయి ఫ్రాంఛైజీ.

ఐపీఎల్​ 13వ సీజన్​ సెప్టెంబర్​ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఆరంభ మ్యాచ్​లో తలపడనున్నాయి రోహిత్​, ధోనీ జట్లు. గతేడాది వీరిద్దరూ సారథులుగా ఉన్న ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ జట్లు ఫైనల్​లో పోటీపడ్డాయి. కాబట్టి వీరిద్దరితోనే టోర్నీ మొదలుపెట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details