టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లుగా వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ (175), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (172) ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ పొట్టి ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేయడం ఎంతో దూరంలో లేనట్లు కనిపిస్తుంది. అయితే ఈ స్కోరు చేయగల సమర్ధవంతమైన బ్యాట్స్మెన్ ఎవరనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిరేకెత్తిస్తోన్న ప్రశ్న. దీనిపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయగల సత్తా రోహిత్ శర్మకు ఉందని తెలిపాడు.
"టీ20ల్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయగలడు. ఒకసారి సెంచరీ చేసిన తర్వాత అతడి స్ట్రైక్ రేట్ అమాంతం 250-300కు పెరుగుతుంది. పొట్టి ఫార్మాట్లో ద్విశతకం కాస్త కష్టమైనదే అయినా దీన్ని కచ్చితంగా సాధించగలడు. మేము ఆడే రోజుల్లో 50 ఓవర్లలో 200 నుంచి 250 స్కోరు చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు 400 నుంచి 500 పరుగులు చేయడం చూస్తున్నాం".