టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఖడ్గమృగాలను సంరక్షించేందుకు మరో అడుగు ముందుకేశాడు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ) ఇండియా, యానిమల్ ప్లానెట్తో కలిసి ప్రచారానికి సిద్ధమయ్యాడు. అంతరించిపోతున్న ఖడ్గమృగాలను కాపాడటానికి తనతో చేతులు కలపాలని రోహిత్ శర్మ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చాడు.
" మనతో పాటు జీవిస్తున్న మిగతా ప్రాణులను కాపాడటం మన కర్తవ్యం. ప్రకృతి ఇచ్చిన వనరులను మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం రక్షించాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, యానిమల్ ప్లానెట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందర్నీ చైతన్యవంతం చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3వేల 500 ఖడ్గమృగాలు ఉన్నాయి. వీటిలో 82% భారత్ లోనే ఉన్నాయి. ఖడ్గమృగాల కోసం ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం రోజున నాతో చేతులు కలపండి".
-- రోహిత్ శర్మ, భారత క్రికెటర్