తెలంగాణ

telangana

ETV Bharat / sports

అరంగేట్రం తర్వాత 6ఏళ్లకు ఓపెనర్​గా రోహిత్​..!

వన్డేలు, టీ20ల్లో ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​గా సత్తా చాటుతున్న రోహిత్​శర్మ.. టెస్టు జట్టుకు ఓపెనర్​గా బరిలో దిగే అవకాశముంది. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్​ 15 నుంచి 3 టీ20లు, 3 టెస్టులు ఆడనుంది టీమిండియా. రాహుల్​ స్థానంలో రోహిత్​కు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారు సెలక్టర్లు. ఇదే జరిగితే.. టెస్ట్​ జట్టుకు అరంగేట్రం చేసిన 6ఏళ్ల తర్వాత ఈ అవకాశం పొందనున్నాడు హిట్​మ్యాన్​.

By

Published : Sep 12, 2019, 9:31 AM IST

Updated : Sep 30, 2019, 7:35 AM IST

అరంగేట్రం తర్వాత 6ఏళ్లకు ఓపెనర్​గా రోహిత్​..!

నిర్ణిత ఓవర్ల క్రికెట్​లో పరుగుల వీరుడు రోహిత్​శర్మ.. త్వరలోనే సుదీర్ఘ మ్యాచ్​ల్లో ఓపెనింగ్​ అవతారం ఎత్తే అవకాశముంది. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హిట్​మ్యాన్​.. దాదాపు 6 ఏళ్లకు ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​గా ఆడే అవకాశం లభించింది. ఇప్పటి వరకు 27 టెస్టు మ్యాచ్​లు ఆడిన ఈ సిక్సర్ల వీరుడు 1585 పరుగులు చేశాడు. సుధీర్ఘా ఫార్మాట్​లో 3 నుంచి 6 స్థానాల మధ్యే ఇప్పటివరకు బరిలో దిగాడు రోహిత్​.

రోహిత్​శర్మ టెస్టు రికార్డు...

స్థానం టెస్టులు ఇన్నింగ్స్ నాటౌట్​​​ పరుగులు అత్యధికం సగటు శతకాలు అర్థశతకాలు స్ట్రైక్​రేటు
నెం.3 4 5 0 107 53 21.40 0 1 41.63
నెం.4 1 1 0 4 4 4.00 0 0 25.00
నెం.5 9 16 1 437 79 29.13 0 3 48.55
నెం.6 16 25 6 1037 177 54.57 3 6 60.71
మొత్తం 27 47 7 1585 177 39.62 3 10 55.01

ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టుకు ఓపెనర్​గా ఉన్న రాహుల్... విండీస్​ పర్యటనలో​ దారుణంగా విఫలమయ్యాడు. చివరి 12 ఇన్నింగ్స్​ల్లో 95 పరుగులు మాత్రమే చేశాడు. నేడు దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టను ఎంపిక చేయనున్నారు సెలక్టర్లు. ఇందులో రాహుల్​ ఓపెనర్​గా ఉద్వాసన ఎదుర్కోనున్నట్లు సమాచారం.

రాహుల్​ టెస్టు రికార్డు...

స్థానం టెస్టులు ఇన్నింగ్స్ నాటౌట్​ పరుగులు అత్యధికం సగటు సెంచరీ అర్ధసెంచరీ స్ట్రైక్​రేటు
చివరి 12 మ్యాచ్​ల్లో 12 1 95 44 17.72 0 0 42.85
ఓపెనర్​గా 33 54 2 1915 199 36.82 5 10 56.22
మొత్తం 36 60 2 2006 199 34.58 5 11 56.45

దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభంకానుంది. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2 నుండి జరుగుతుంది. ప్రస్తుతం 5 రోజుల మ్యాచ్​లో మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా హిట్​మ్యాన్​ను ఓపెనర్‌గా బరిలోకి దించాలని సూచించాడు.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details