తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్యాన్స్ డ్యాన్స్​... రోహిత్ దిల్​ఖుష్​..! - rohit sharma

వెస్టిండీస్​తో రెండో టెస్టు అనంతరం అభిమానులతో సరదాగా గడిపాడు రోహిత్​శర్మ. ఇద్దరు జమైకన్ ఫ్యాన్స్ డ్యాన్స్​ చేస్తుంటే.. వారిని అభినందిస్తూ కాలు కదిపాడు హిట్ మ్యాన్.

రోహిత్ శర్మ

By

Published : Sep 3, 2019, 7:26 PM IST

Updated : Sep 29, 2019, 8:00 AM IST

వెస్టిండీస్​ పర్యటనలో టీ 20, వన్డే సిరీస్​లను కైవసం చేసుకున్న టీమిండియా... తాజాగా టెస్టు సిరీస్​నూ2-0 తేడాతోక్లీన్​స్వీప్​ చేసింది. ఈ ఆనందంలో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ అభిమానులతో సందడి చేశాడు. ఇద్దరు ఫ్యాన్స్​​ డ్యాన్స్​ చేస్తుంటే వారిని అభినందిస్తూ కాలు కదిపాడు రోహిత్. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకుంది బీసీసీఐ.

"45వ నెంబర్ జెర్సీ ధరించిన ఇద్దరు జమైకన్ అభిమానులతో హిట్ మ్యాన్ సందడి చేశాడు" అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

కింగ్​​స్టన్ వేదికగా వెస్టిండీస్​తో మూడో టెస్టులో భారత్ 257 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తెలుగు తేజం హనుమ విహారీ ఒక శతకం, ఒక అర్ధశతకంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డూ దక్కించుకున్నాడు.

ఈ గెలుపుతో సుధీర్ఘ ఫార్మాట్​లో ఎక్కువ విజయాలు అందుకున్న భారత జట్టు సారథిగా విరాట్​కోహ్లీ రికార్డు సృష్టించాడు. తొలి టెస్టులో భారత్ 318 పరుగుల తేడాతో గెలిచింది.

ఇది చదవండి: విరుష్క జోడీకే ఆటోగ్రాఫ్​ ఇచ్చిన బుడతడు

Last Updated : Sep 29, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details