తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎన్​సీఏలో రోహిత్​ ఫిట్​నెస్​ ట్రైనింగ్​ షురూ! - ఎన్​సీఏలో రోహిత్​ శర్మ ఫిట్​నెస్​ ట్రైనింగ్​

గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్​ క్రికెట్​ అకాడమీలో పునరావాసానికి వెళ్లిన టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ.. గురువారం ఫిట్​నెస్​ ట్రైనింగ్​ మొదలుపెట్టాడు. హిట్​మ్యాన్​ ఇక్కడ పూర్తిస్థాయిలో ఫిట్​నెస్​ సాధిస్తేనే ఆసీస్​తో జరగబోయే టెస్ట్​ సిరీస్​కు అర్హత సాధిస్తాడు.

rohith
రోహిత్​

By

Published : Nov 19, 2020, 6:12 PM IST

ఆస్ట్రేలియాతో టెస్ట్​ సిరీస్​ ఆడేందుకు టీమ్‌ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో గాయపడిన హిట్​మ్యాన్​.. ఇటీవల బెంగళూరులోని ఎన్​సీఏలో పునరావాసానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే గురువారం ఫిట్​నెస్​ ట్రైనింగ్ ప్రారంభించాడు.

పాసైతేనే

రోహిత్​ శర్మ.. ఐపీఎల్​లో గాయపడిన తర్వాత కోలుకొని ఫైనల్​ సహా రెండు మ్యాచ్​లు ఆడాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందులో రోహిత్​ ఎంపిక అవ్వలేదు. మరోవైపు సారథి కోహ్లీ.. పితృత్వ సెలవులు తీసుకొని టెస్ట్​ సిరీస్​లోని చివరి మూడు మ్యాచ్​లకు దూరమయ్యాడు. దీంతో ఆ మూడు మ్యాచ్​లకు హిట్​మ్యాన్​ను తీసుకున్నారు. అయితే పూర్తిస్థాయి ఫిట్​నెస్​ సాధిస్తేనే రోహిత్​ ఈ పర్యటనలో పాల్గొనే అవకాశముంది. ఇందుకోసం బెంగళూరులోని ఎన్​సీఏలోని పునరావాసానికి వెళ్లాడు. కానీ ఇక్కడ ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత యోయో పరీక్ష కూడా ఉంటుంది. అందులో‌నూ పాసైతేనే టెస్ట్​ సిరీస్​కు అర్హత లభిస్తుంది.

కోహ్లీ

మరోవైపు, ఐపీఎల్‌లో గాయాల పడిన వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ కోలుకున్నారు. ప్రస్తుతం ఎన్​సీఏలో ఉన్న వారు కూడా తిరిగి సాధన మొదలెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఇటీవల బీసీసీఐ ట్వీట్​ చేసింది.

ఇదీ చూడండి :

'రోహిత్​ కెప్టెన్​ కాకపోతే టీమ్​ఇండియాకే నష్టం'

రోహిత్‌కు పరీక్ష?.. యోయో టెస్ట్​లో పాసైతేనే

ABOUT THE AUTHOR

...view details