తెలంగాణ

telangana

ETV Bharat / sports

సొంతగడ్డపై మొదటి సెంచరీతో అదరగొట్టిన పంత్​ - IND vs ENG

ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మన్, వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్ సెంచరీతో అలరించాడు. సొంత గడ్డపై పంత్​కు ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం.

Rishabh Pant hits a century in fourth test against england
సొంతగడ్డపై మొదటి సెంచరీతో అదరగొట్టిన పంత్​

By

Published : Mar 5, 2021, 4:34 PM IST

Updated : Mar 5, 2021, 6:40 PM IST

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మన్ రిషభ్​ పంత్ శతకం చేశాడు. 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సిక్సర్​తో శతకం సాధించి ఆ వెంటనే అండర్సన్​ బౌలింగ్​లో రూట్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

సొంతగడ్డపై పంత్​ సాధించిన తొలి శతకం ఇదే కాగా.. టెస్టుల్లో ఇది మూడో సెంచరీ. ఈ ఘనతతో 2021లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా పంత్​ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్​ ఆటగాడు జో రూట్​ 764 పరుగులతో ముందంజలో ఉన్నాడు.

భారత వికెట్​ కీపర్లలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు పంత్​.

ధోనీ 144 ఇన్నింగ్స్​ల్లో 6, సాహా 50 ఇన్నింగ్స్​ల్లో 3 శతకాలు చేశారు. పంత్​ ఇప్పుడు 33 ఇన్నింగ్సుల్లోనే 3 సెంచరీలతో అదరగొట్టాడు.

ఇదీ చదవండి:దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన​ స్పాన్సర్​గా 'జేఎస్​డబ్ల్యూ'

Last Updated : Mar 5, 2021, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details