తెలంగాణ

telangana

ETV Bharat / sports

కసిగా బాదుతున్న పంత్.. ప్రాక్టీస్​లో సిక్సుల మోత! - రిషబ్ పంత్ ప్రాక్టీస్

దిల్లీ క్యాపిటల్స్​ యువ ఆటగాడు రిషబ్ పంత్ కసిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి ఐపీఎల్​లో సత్తాచాటి టీమ్​ఇండియా జట్టులో చోటు పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు.

Rishabh Pant displays dazzling strokeplay at Delhi Capitals net session
కసిగా బాదుతున్న పంత్

By

Published : Sep 8, 2020, 7:17 PM IST

Updated : Sep 8, 2020, 7:29 PM IST

టీమ్​ఇండియా జట్టులో ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు టీమ్​ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కీపింగ్​ బాధ్యతలు చేపట్టి సత్తాచాటాడు. ఫలితంగా పంత్ స్థానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఈసారి ఐపీఎల్​లో సత్తాచాటి భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలన్న కసితో ఉన్నాడు పంత్. అందుకోసం గట్టిగానే శ్రమిస్తున్నాడు.

దిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్​ సెషన్​లో సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు పంత్. ఆ జట్టు స్పిన్నర్ల బౌలింగ్​లో సిక్సర్లతో మోత మోగించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

Last Updated : Sep 8, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details