భారత వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. కాంకషన్ (తల అదరడం)కు గురయ్యాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఈ సంఘటన జరిగింది. టీమిండియా ఇన్నింగ్స్ 44వ ఓవర్లో కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని... పంత్ పుల్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మొదట బ్యాట్‌కు తగిలిన బంతి.. ఆ తర్వాత హెల్మెట్‌ను తాకింది. అప్పట్నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రిషభ్... రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేకు అందుబాటులోకి ఉండకపోవచ్చని సమాచారం.
వైద్యుల పర్యవేక్షణలో పంత్... రాజ్‌కోట్‌కు అనుమానం! - cricket news
ఆసీస్‌తో తొలి వన్డేలో కాంకషన్‌కు గురైన పంత్.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు. గాయం తీవ్రమైతే అతడు రెండో వన్డేకు అందుబాటులోకి రాకపోవచ్చు.
భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్
ఆసీస్‌తో మొదటి మ్యాచ్‌లో... రిషభ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేశాడు. పంత్ కోలుకోడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైతే.. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఇండియా-ఏ తరఫున ఆడుతున్న సంజు శాంసన్‌కు అవకాశం వస్తుందేమో చూడాలి. లేదంటే రాహుల్ కీపర్‌గా, మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.