తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లాగింగ్​: మనతో పాటు దేశమూ ఫిట్

ఫిట్​నెస్​తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో 'ఫిట్ ఇండియా ప్లాగ్ రన్'​కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందుకోసం అక్టోబరు 2న ప్రతి ఒక్కరూ 2 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ.. దారిలో కనిపించే చెత్తను తొలగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి మోదీ.

ప్లాగింగ్

By

Published : Sep 30, 2019, 7:51 AM IST

Updated : Oct 2, 2019, 9:18 PM IST

ప్లాగింగ్.. ప్లాగింగ్.. ప్లాగింగ్.. ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే మాట.. రన్నింగ్ గురించి విన్నాం.. జాగింగ్ గురించి విన్నాం..! ఈ ప్లాగింగ్ ఏంటని అనుకుంటున్నారా? పరుగులు తీస్తూ.. ప్లాస్టిక్​ ఏరివేస్తూ.. పర్యావరణాన్ని పరిశుభ్రం చేయడమే ఈ ప్లాగింగ్.

యువత ఫిట్​గా ఉండాలనే ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలపెట్టిన ఉద్యమం 'ఫిట్​ ఇండియా'. 2022 నాటికి ప్లాస్టిక్​ను సంపూర్ణంగా నిషేధించాలని ఇప్పటికే ప్రకటించింది మోదీ సర్కార్. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ను నియంత్రించాలని నిర్ణయించింది. ఈ రెండు అంశాలను కలిపి 'ఫిట్​ ఇండియా ప్లాగ్​ రన్'​ను తీసుకురానుంది.

'ఫిట్ ఇండియా ప్లాగ్ రన్​'.. అంటే

జాగింగ్ చేస్తూ.. దారిలో కనిపించే ప్లాస్టిక్​ వ్యర్థాలను, చెత్తను ఏరివేయడాన్నే ప్లాగింగ్ అంటారు. స్వచ్ఛత, ఆరోగ్యమే నినాదాలుగాఈ కార్యక్రమం ముందుకు సాగనుంది. ఆరోగ్యంగా ఉంటూ, పరిసరాలను శుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 29న మోదీ ప్రారంభించిన 'ఫిట్​ఇండియా'లో భాగంగానే ప్లాగ్​రన్​ అమలు కానుంది.

అక్టోబరు 2న జరగనున్న ఈ ప్లాగ్​రన్​లో దేశ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్​ రిజిజు కోరారు. 'ఫిట్​ ఇండియా' ఉద్యమంలో భాగంగానే 'ఫిట్ ఇండియా ప్లాగ్ రన్​'నుమోదీ ప్రారంభించారని చెప్పారు.

" ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన 'ఫిట్​ ఇండియా' ప్రచారం​ ప్రజా ఉద్యమంగా మారుతోంది. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. ఎందుకంటే మనం ఫిట్​గా ఉంటే దేశం ఫిట్​గా ఉంటుంది" - కిరణ్ రిజిజు, క్రీడాశాఖ మంత్రి

ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,200 కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్​ఈ పాఠశాలలు, వాణిజ్య సంస్థలు సహా 2,500 రెసిడెన్సీ సంఘాలు 'ఫిట్​ ఇండియా ప్లాగ్​ రన్'​లో భాగస్వాములయ్యాయి.

"మహాత్మా గాంధీ జన్మదినాన (అక్టోబరు 2) ప్రతి ఒక్కరూ రెండు కిలో మీటర్లు జాగింగ్ చేయాల్సిందిగా కోరుతున్నా. దారిలో కనిపించే చెత్తను సేకరిస్తూ ముందుకెళ్లాలి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేసిన వాళ్లమవుతాం. ఈ దిశగా దేశంలోని 130 కోట్ల మంది కలిసి ఒక్క అడుగేస్తే.. ప్లాస్టిక్ నియంత్రణపై భారత్ 130 కోట్ల అడుగులతో ముందుకెళ్తుంది" - ప్రధాని నరేంద్ర మోదీ

ప్లాగ్ రన్​పై మోదీ

సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్​యూపీ) అంటే..

ఒకసారి మాత్రమే వాడి పడేసే ప్లాస్టిక్ బ్యాగ్​లు​, కప్పులు, ప్లేట్​లు, బాటిల్స్, స్ట్రాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. వీటివల్ల పర్యావరణ కాలుష్యం రోజురోజూకు తీవ్రమవుతుంది. చౌకగా, పట్టుకెళ్లేందుకు సులువుగా ఉండడం వల్ల వీటి వినియోగం ఎక్కువవుతోంది. ఏటా 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 50 శాతం ఒకసారి వాడిపడేసేవే. 70 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ప్లాస్టిక్ ఉత్పత్తి 190 రెట్లు అధికమైంది.

మరో పదేళ్లలో.. బెంగళూరు నగరమంతా చెత్త

రోజుకు 26వేల టన్నులు ప్లాస్టిక్ చెత్త తయారవుతోంది. మరో పదేళ్లలో 160 మిలియన్ టన్నులకు చేరుతుంది. ఈ ప్లాస్టిక్ చెత్త ఒకచోట కుప్పలా పోస్తే 10 మీటర్ల ఎత్తులో బెంగళూరు నగరమంతా విశాలమైన పెద్ద చెత్తకుప్ప తయారవుతుందట. ఈ రకంగా మన చెత్త కొండలు, గుట్టలుగా పేరుకుపోతుంది.

ప్లాస్టిక్​ను పునర్వివినియోగించలేమా...

శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన ప్రకారం 94 శాతం ప్లాస్టిక్​ను పునర్వివినియోగించుకోవచ్చు. కానీ భారత్​లో 60 శాతమే రీసైక్లింగ్ చేస్తున్నారు. మిగతాది భూమిపై డంప్ చేస్తున్నారు. కొంతభాగం సముద్రాల్లో, నదుల్లో కలిపేస్తున్నారు. దీనివల్ల భూమి కాకుండా నీరు కూడా కలుషితమవుతోంది. జలచరాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.

ప్లాస్టిక్​ను ఎక్కువ సార్లు రీసైక్లింగ్ చేసినా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మూడు, నాలుగు కంటే ఎక్కువ సార్లు రీసైక్లింగ్ చేస్తే, అందులో కలిపే రసాయనాలు, రంగుల వల్ల పర్యావరణం మరింత కలుషితమయ్యే ముప్పు ఉందంటున్నారు.

భారత్​ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలదా..!

ప్లాస్టిక్ నియంత్రణలో భారత్​ వెనుకంజలో ఉందనే చెప్పాలి. నగరాలు, పట్టణాల్లో చెత్తను సంఘటితపరిచే వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం. ఏడాదికి 14 మిలియన్​ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తుంటే అందులో నిషేధిస్తుంది 5 నుంచి 10 శాతం మాత్రమే. కొన్ని రాష్ట్రాల్లో నిషేధించిన ప్లాస్టిక్​ వస్తువులనూ అక్రమంగా వాడుతున్నారు.

ఈ సమస్యల నుంచి తప్పించుకునేందుకే మోదీ సర్కార్ ప్లాస్టిక్ వినియోగం​పై ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ నిషేధించాలని భావించింది. ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసింది. 'ఫిట్ ఇండియా ప్లాగ్ రన్'​ ద్వారా వీధుల్లో, రోడ్లపై ఉన్న చెత్తను ఏరివేసే మహత్కర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది.

ఇవీ చూడండి:

*సీఏసీ పదవికి శాంతా రంగస్వామి రాజీనామా

*యువరాజ్​ ఫొటోకు సానియా కామెంట్

Last Updated : Oct 2, 2019, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details