తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రీడల నిర్వహణపై రాష్ట్రాలతో రిజిజు సమావేశం

దేశంలో త్వరలోనే క్రీడాకార్యక్రమాలు పునరుద్ధరించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. క్రీడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్రాల అధికారులతో కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ఈ నెల 14 నుంచి రెండు రోజుల పాటు జరగనుంది.

Rijiju to hold 2-day online meet with state sports ministers to discuss way forward amid COVID-19
క్రీడల నిర్వహణపై రాష్ట్రాలతో చర్చించనున్న కిరణ్​ రిజిజు

By

Published : Jul 12, 2020, 8:32 PM IST

లాక్​డౌన్​ సడలింపుల తర్వాత దేశంలో క్రీడాకార్యకలపాలు తిరిగి ప్రారంభించడంపై రాష్ట్రాలతో కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు మాట్లాడనున్నారు. జులై 14 నుంచి రాష్ట్రాల మంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా సంబంధిత అధికారులతో ఆన్​లైన్​ ద్వారా మంత్రి చర్చలు జరపనున్నారు.

రెండు రోజుల ఆన్​లైన్​ సమావేశంలో దేశవ్యాప్తంగా క్రీడా పోటీల నిర్వహణ, గ్రామీణ స్థాయిలో ప్రతిభను గుర్తించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రతి రాష్ట్రంలో క్రీడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంపై ఈ సమావేశంలో ప్రణాళికలు రూపొందించనున్నారు.

"దేశంలో ప్రస్తుతం కరోనా అన్​లాక్​డౌన్​ రెండోదశ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలతో చర్చలు జరిపి క్రీడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాక్​డౌన్​ సమయంలో నిర్దేశించిన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని క్రీడా కార్యకలాపాలు కొనసాగనున్నాయి".

- కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి

కరోనాపై పోరాటంలో భాగంగా పౌరసంస్థలకు సహాయం చేసిన నెహ్రూ యువ కేంద్ర సంగథన్​ (ఎన్​వైకేఎస్​), నేషనల్​ సర్వీస్​ స్కీమ్​ (ఎన్​ఎస్​ఎస్​)కు చెందిన 75 లక్షల మంది వాలంటీర్లను రిజిజు ప్రశంసించారు. అథ్లెట్లకు ఆన్​లైన్​ శిక్షణా తరగతులు నిర్వహించడం పట్ల క్రీడాకారుల నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రి తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details