కెప్టెన్సీ విషయమై టీమిండియా సెలక్టర్లు వ్యవహరించిన తీరును భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ ప్రదర్శనపై ఒక్క సమావేశమైన నిర్వహించకుండా కోహ్లీని కెప్టెన్‌గా ఎలా కొనసాగిస్తారంటూ గావస్కర్ మండిపడ్డాడు. తాజాగా ఈ విషయంపై మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. అతడి మాటలతో నేను ఏకీభనించలేను అని తెలిపాడు.
"కోహ్లీని కెప్టెన్‌గా నియమిస్తూ భారత్ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గావస్కర్ తప్పుబట్టడం సరికాదు. నేను ఆయన వాదనను గౌరవంగా తిరస్కరిస్తున్నా. వరల్డ్‌కప్‌లో భారత జట్టు ప్రదర్శన మరీ అంత చెత్తగా ఏమీ లేదు. ఏడు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే ఓడిపోయింది. టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన బాగానే ఉంది. కెప్టెన్‌గా కోహ్లీ నియామకం సరైనదే. కానీ సెలక్టర్లు చిత్తశుద్ధిగా వ్యవహరించడం చాలా ముఖ్యం"
-సంజయ్ మంజ్రేకర్, భారత మాజీ ఆటగాడు