అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది బెంగళూరు జట్టు. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 85 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ.. 13.3ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో బౌలర్లు సిరాజ్(3), చాహల్(2), నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసి కీలక పాత్ర పోషించారు. కోల్కత్తా బ్యాట్స్‌మెన్స్ అందరూ తేలిపోయారు. బౌలర్లలో ఫెర్గూసన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
కోల్‌కతాపై బెంగళూరు ఘన విజయం - ఆర్సీబీ కోల్‌కతా మ్యాచ్ స్క్వాడ్
22:20 October 21
22:07 October 21
పది ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు జట్టు రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగలు చేసింది. క్రీజులో కోహ్లీ (7), గుర్కీరత్ సింగ్ (10 ) జాగ్రత్తగా ఆడుతోన్నారు. విజయానికి 60 బంతులో 22 పరుగులు అవసరం.
22:00 October 21
7 ఓవర్లకు బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. ఫెర్గూసన్ ఈ ఓవర్లో 2 పరుగులిచ్చాడు. ఫించ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత గురుకీరత్ (0) కారణంగా దూకుడుగా ఆడుతున్న పడిక్కల్ (25; 17 బంతుల్లో 3×4) రనౌట్ అయ్యాడు. వీరిద్దరూ ఒకే ఎండ్‌కు చేరుకోవడం గమనార్హం. కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.
21:44 October 21
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ఆచితూచి ఆడుతోంది. ఐదు ఓవర్ల పూర్తయ్యేసరికి వికెట్ ఏమీ నష్టపోకుండా 37పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(18), ఫించ్(15) ఉన్నారు.
21:01 October 21
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ను నిర్ణీత 20ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 84పరుగులు మాత్రమే చేసింది. సారథి మోర్గాన్(30) మినహా మిగితా బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్(3), చాహల్(2), నవ్‌దీప్ సైని, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.
20:49 October 21
కోల్‌కతా 16ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో కుల్దీప్ యాదవ్ (4 ), ఫెర్గూసన్ (1) ఉన్నారు.
20:37 October 21
బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కోల్‌కతా ఆరో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో ప్యాట్కమ్మిన్స్(4) షాట్‌కు యత్నించి పడిక్కల్ చేతికి చిక్కాడు. దీంతో 14 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 46పురుగులు మాత్రమే చేసింది మోర్గాన్ సేన.
20:20 October 21
8.4 ఓవర్లకు కోల్‌కతా ఐదు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. కార్తీక్‌ను చాహల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా, బెంగళూరు రివ్యూకి వెళ్లి వికెట్ సాధించింది. క్రీజులో మోర్గాన్ (13), కమిన్స్ ఉన్నారు
20:16 October 21
8 ఓవర్లకు కోల్‌కతా నాలుగు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. సైని వేసిన ఆఖరి బంతిని మోర్గాన్ (12) స్టాండ్స్‌కు తరలించాడు. అతడికి కార్తీక్ (3) సహకారం అందిస్తున్నాడు. ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి.
19:57 October 21
కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్‌ను బెంగళూరు జట్టు బౌలర్లు బాగా కట్టడి చేస్తున్నారు. దీంతో 4.2ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 15పరుగులు మాత్రమే చేసింది కోల్‌కతా. క్రీజులో మొర్గాన్, కార్తీక్ ఉన్నారు.
19:45 October 21
ఆర్సీబీ బౌలర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్‌ను చిత్తు చేస్తున్నారు. దీంతో 2.2 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో టామ్ బాంటన్, దినేశ్ కార్తీక్ వచ్చారు.
19:38 October 21
కోల్‌కతాను ఆదిలోనే దెబ్బతీసింది ఆర్సీబీ. వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది మోర్గాన్ సేన. రాహుల్ త్రిపాఠి(1) నితీశ్ రానా(0) ఔట్ అయ్యారు. దీంతో 2ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు పరుగులు మాత్రమే చేసింది.
19:11 October 21
జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ :శుభమన్ గిల్, టామ్ బాంటన్, నితీష్ రానా, మోర్గాన్ (సారథి), దినేష్ కార్తీక్ , రాహుల్ త్రిపాఠి, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (సారథి), ఎబీ డివిలియర్స్ , గుర్కీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, యుజువేంద్ర చాహల్.
19:01 October 21
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. బెంగళూరు జట్టు బౌలింగ్ దాడి చేయనుంది.
18:21 October 21
అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా, కోల్‌కతా నాలుగో స్థానంలో ఉంది. ఈ పోరులో గెలచి పాయింట్ల పట్టికలో ఎగబాకాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి?