గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. దొరికిన ఖాళీ సమయాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. జామ్‌నగర్‌లోని అటవీ సందర్శనకు వెళ్లిన జడ్డూకు.. అక్కడ ఒక పులి కనిపించింది. ఇంకేముంది దానిని తన కెమెరాలో బంధించి.. ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
జడేజాను పలకరించిన ప్రత్యేక అతిథి? - రవీంద్ర జడేజా
గాయం కారణంగా ఆటకు దూరమైన భారత క్రికెటర్ రవీంద్ర జడేజా.. సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. జామ్ నగర్‌లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లిన జడ్డూకు.. అక్కడొక పులి కనిపించింది. దానిని కెమెరాలో బంధించిన జడేజా ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
'నేను త్వరగా కోలుకోవాలని పులి ఆకాంక్షించింది'
"పులి బయటికి వచ్చి.. నేను గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంది" అని జడేజా ట్విట్టర్లో చమత్కరించాడు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సిడ్నీ టెస్టులో గాయపడిన జడేజా.. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
ఇదీ చదవండి:ఫిట్నెస్ పాస్.. నెట్టింట ఫిలాసఫీ క్లాస్
Last Updated : Mar 20, 2021, 4:27 PM IST