తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​ యువ సంచలనం రషీద్​ఖాన్​ రికార్డుల మోత - afganisthan cricket

అఫ్గానిస్థాన్​ క్రికెటర్​ రషీద్​ ఖాన్​ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిసారి కెప్టెన్​గా 5 వికెట్లు తీసి, అర్ధశతకం చేశాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

అఫ్గాన్​ యువ సంచలనం రషీద్​ ఖాన్​ రికార్డుల మోత

By

Published : Sep 7, 2019, 5:36 PM IST

Updated : Sep 29, 2019, 7:14 PM IST

అఫ్గానిస్థాన్​ యువ సంచలనం రషీద్​ ఖాన్​ వరుస రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఐదు వికెట్లు తీసి, అర్ధశతకం చేశాడు. అరంగేట్ర కెప్టెన్సీ మ్యాచ్​లోనే ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

దిగ్గజాల సరసన...

టెస్టు సారథ్యం చేపట్టిన తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్​ మాజీ సారథి షెల్డన్​ జాక్సన్​(1905), పాక్​ మాజీ కెప్టెన్​ ఇమ్రాన్​ ఖాన్​(2009), బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​(2009)... 5 వికెట్లు తీసి 50కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలోకి ఇప్పుడు రషీద్​ చేరాడు.

సుదీర్ఘ ఫార్మాట్​​లో ఐదు వికెట్ల ఫీట్​ సొంతం చేసుకోవడంరషీద్​కు ఇది రెండోసారి. ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్​తో జరిగిన టెస్టులో తొలిసారి పాంచ్​ పటాకా సాధించాడీ బౌలర్.

పిన్న వయసులో...

టెస్టు క్రికెట్​లో పిన్న వయసులోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన ఆటగాడిగానూ ఈ మ్యాచ్​తో రికార్డు సాధించాడు రషీద్. గతంలో జింబాబ్వే మాజీ క్రికెటర్​ తైబు 20 ఏళ్ల 358 రోజుల వయసులో కెప్టెన్​ అయ్యాడు. రషీద్​ వయసుప్రస్తుతం 20 ఏళ్ల 350 రోజులు. వీరిద్దరి తర్వాత స్థానంలో ఉన్నాడు భారత మాజీ క్రికెటర్​​ మన్సూర్​ అలీఖాన్​ పటౌడీ. ఇతడు 21 ఏళ్ల 77 రోజుల వయసులో టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్​గా బాధ్యతలు నిర్వహించాడు.

గతేడాదే టెస్టు హోదా పొందిన అఫ్గాన్​ జట్టు తొలి మ్యాచ్​ భారత్​తో, రెండో మ్యాచ్​ ఐర్లాండ్​తో ఆడింది. కోహ్లీసేన చేతిలో 262 పరుగుల తేడాతో ఓడినా.. ఐర్లాండ్​పై 7వికెట్ల తేడాతో గెలిచింది.

ఇదీ చదవండి...ఇంగ్లీష్ అభిమానులకు డేవిడ్ వార్నర్​ కౌంటర్

Last Updated : Sep 29, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details